పోగొట్టుకున్న ఫోన్ ను తిరిగి అప్పగించిన పట్టణ సీఐ

Town CI who returned the lost phoneనవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట పట్టణంలోని దుర్గా కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   చెన్నబోయిన సమ్మయ్య తన ఫోన్ ను గత నెల 17 న తన జేబులో నుండి పోయిందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అట్టి ఫోన్ యొక్క నంబర్ ఆధారంగా దొరకబట్టి ఆ ఫోనును సమ్మయ్యకు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో పట్టణ సీఐ వరగంటి రవి అప్పగించారు. ఫోన్ లను జాగ్రత్తగా పెట్టుకోవాలని, ఒకవేళ ఫోన్ లను ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లయితే ఫోన్ యొక్క ఐఎంఈ నంబర్ ఆధారంగా దొరక బట్టి బాధితులకు అప్పగించడం జరుగుతుందని పట్టణ సీఐ తెలిపారు. పోగొట్టుకున్న ఫోన్ ను తిరిగి అప్పగించినందుకు పట్టణ సీఐ వరగంటి రవి కి సమ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు.