యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం చేసుకున్న టొయోటా కిర్లోస్కర్ మోటర్

– దేశవ్యాప్తంగా వినియోగదారులకు వినూత్నమైనఫైనాన్సింగ్ అవకాశాలను అందించనున్న ఈ భాగస్వామ్యం.
– వ్యక్తిగత వినియోగపువాహనాల ఆన్-రోడ్ ధరపై 90% వరకు ఫైనాన్సింగ్  అవకాశాలను  అందిస్తుంది.
నవతెలంగాణ – బెంగుళూరు: వినూత్న పరిష్కారాల ద్వారా వినియోగదారుల అనుభవాలను మెరుగుపరచడంతో పాటుగా కారు యాజమాన్య అనుభవాలను క్రమబద్ధీకరించాలనే తమ నిరంతర ప్రయత్నంలో భాగంగా  టొయోటా కిర్లోస్కర్ మోటర్ (టికెఎం)  నేడు వినియోగదారులకు  సమగ్రమైన వాహన ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించటం కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం చేసుకుంది. కస్టమర్‌ల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడం ,  టొయోటా వాహనాలను గతంలో కంటే మరింత మెరుగ్గా అందుబాటులోకి తీసుకురావడానికి ఆకర్షణీయమైన పరిష్కారాలను అందించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. దీనిలో భాగంగా వ్యక్తిగత వినియోగం కోసం కొనుగోలు చేసిన ఏదైనా టొయోటా వాహనాల ఆన్-రోడ్ ధరపై 90% వరకు ఫైనాన్సింగ్‌ను అందించనున్నారు. అలాగే యూనియన్ వెహికల్ స్కీమ్ కింద  సంవత్సరానికి 8.80% నుండి ప్రారంభమయ్యే  ప్రస్తుత వడ్డీ రేట్లతో 84 నెలల వరకు సౌకర్యవంతమైన ఈఎంఐ సదుపాయాలను వినియోగించుకోవచ్చు. వీటితో పాటుగా యూనియన్ పరివాహన్ పథకం కింద  వాణిజ్య వాహనాల కోసం 60 నెలల వరకు ఫైనాన్సింగ్ అవకాశాలు అందిస్తారు.
టొయోటా కిర్లోస్కర్ మోటర్ సంస్థ యొక్క సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శబరి మనోహర్ మాట్లాడుతూ, “దేశవ్యాప్తంగా వాహన ఫైనాన్సింగ్ అవకాశాలను  పెంపొందించడం కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం చేసుకోవటాన్ని మేము సంతోషిస్తున్నాము. ఈ  భాగస్వామ్యం ద్వారా, టయోటా వాహనాన్ని  గ్రామీణ మరియు సెమీ-అర్బన్ ప్రాంతాలలో ఎక్కువ మంది కస్టమర్‌లకు చేరువ చేయడం తమ  లక్ష్యం” అని అన్నారు.  ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, “అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటిగా, టయోటా కిర్లోస్కర్ మోటర్‌తో భాగస్వామ్యం చేసుకోవడం ఆనందంగా ఉంది.  మా డిజిటలైజ్డ్ లోన్ విధానాలు అత్యంత సులభంగా కొత్త టొయోటా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లను అనుమతిస్తాయి  ” అని అన్నారు.