న్యూఢిల్లీ : ప్రముఖ ప్రీమియం కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) తన సెడాన్ మోడల్ కారు కమ్రీ అప్‌డేటెడ్ వర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసినట్టు తెలిపింది. దీని ప్రారంభ ధరను రూ.48 లక్షలుగా నిర్ణయించింది. భద్రతతో పాటు అదనపు ఫీచర్లు, న్యూ ఇంటీరియర్ లే ఔట్, ఆల్ న్యూ డిజైన్లు ఉన్నాయి. గత మోడల్ కమ్రీ కారు కంటే మైలేజీ ఎక్కువ ఇస్తుందని పేర్కొంది. ప్రీ బుకింగ్స్‌ను తెరిచినట్టు వెల్లడించింది. లీటర్ పెట్రోల్‌తో 25 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని తెలిపింది.