కాంగ్రెస్‌తోనే పాలమూరు జిల్లాకు న్యాయం :టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ వచ్చినా పాలమూరు గోస తీరలేదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే పాలమూరు జిల్లాకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, శ్రీశైలం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నిర్మించామని గుర్తు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని రేవంత్‌ నివాసంలో వారికి కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. గద్వాల నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌, వెంకట్‌ రామిరెడ్డి, రిటైర్డ్‌ ఎంఈవో సత్యనారాయణ, ఎంపీటీసీలు శివారెడ్డి, ఈశ్వర్‌, మాజీ ఎంపీపీలు గోవింద్‌, నాయుడు,సర్పంచ్‌ సునీత, వార్డు సభ్యులు ఉన్నారు. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను తిరగబడదాం.. తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.