డిసెంబర్‌ 19 నుంచి టీపీఎల్‌

TPL from December 19– తొలి సీజన్‌ రెండో అంచె పోటీలు
హైదరాబాద్‌ : తైక్వాండో ప్రీమియర్‌ లీగ్‌ (టీపీఎల్‌) తొలి సీజన్‌ రెండో అంచె పోటీలు డిసెంబర్‌ 19 నుంచి 21 వరకు జరుగనున్నాయి. ఈ మేరకు సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు వెల్లడించారు. రెండో అంచె పోటీలు ప్రత్యేకించి యువ క్రీడాకారుల(అండర్‌-17) ఉద్దేశించి నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ గ్లైడర్స్‌, హర్యానా హంటర్స్‌, బెంగళూర్‌ నింజాస్‌, ఢిల్లీ వారియర్స్‌, మహారాష్ట్ర అవెంజర్స్‌, అస్సాం హీరోస్‌, గుజరాత్‌ థండర్స్‌, రాజస్థాన్‌ రెబల్స్‌ జట్లు టీపీఎల్‌ టైటిల్‌ కోసం పోటీపడుతున్నట్టు లీగ్‌ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో టీపీఎల్‌ డైరెక్టర్‌ దువ్వూరి గణేశ్‌, వెంకట జంగం, నవనీత బాచు, జయంత్‌ రెడ్డి సహా ప్రాంఛైజీల యజమానులు పాల్గొన్నారు.