ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కలిసిన టీపీఎస్ఎఫ్ జిల్లా కమిటీ నాయకులు

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని మంగళవారం హైదరాబాద్లోని ఆయన  కార్యాలయంలో తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా టీపీఎస్ఎఫ్ జిల్లా కమిటీ నాయకులు పంచాయతీ కార్యదర్శుల పలు సమస్యలను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి  దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై అవగాహన ఉందని, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లుటిపిఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిఎస్ఎఫ్  స్టేట్ కమిటీ కోశాధికారి శశిధర్ గౌడ్, నల్గొండ జిల్లా అధ్యక్షులు మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి, ట్రెజరర్ నరేష్, జాయింట్ సెక్రటరీ వెంకన్న, జిల్లా మహిళా అధ్యక్షురాలు శైలజ,నల్గొండ జిల్లా డివిజనల్ అధ్యక్షులు రామకృష్ణ, జైహిందర్ నాయక్,వాసుదేవరెడ్డి, రమేష్ గౌడ్,  రమేష్,నవీన్,వెంకటేష్,నగేష్,రవి,జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.