పిఆర్సి ఛైర్మెన్ ను కలిసిన టిపిఎస్ఎఫ్

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్  
రాష్ట్ర పిఆర్సి  చైర్మన్ ఎన్.శివశంకర్ ను  తెలంగాణ పంచాయతీ సెక్రెటరీస్ ఫెడరేషన్ బృందం ఆధ్వర్యంలో మంగళవారం కలిశారు. ఈ సందర్బంగా   గ్రేడ్ -4 పంచాయతీ కార్యదర్శులకు సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇవ్వాలని, పంచాయతీ కార్యదర్శులకు నెలవారి ఫిక్స్డ్ ట్రావెల్ అలవెన్స్ సదుపాయం కల్పించాలని,ఓ పి ఎస్ ను  జె పి ఎస్  కన్వర్షన్ చేసి రూ. 28719 ఇవ్వాలని కోరారు. అదే విదంగా  మొబైల్ ఫోన్,టాబ్లడ్  ఇవ్వాలని కోరారు. కాగా  చైర్మన్, వారి బృందం, సానుకూలంగా స్పందించినట్లు టిపిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఏ. శ్రీకాంత్ తెలిపారు.చైర్మన్ ను  కలిసిన వారిలో టి పి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు కే. మధు, తదితరులు ఉన్నారు.