
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కళాశాలలో టి పి టి ఎఫ్ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని శనివారం నిర్వహించుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు పి మహేందర్ రెడ్డిలు హాజరయ్యారు. టి పి టి ఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు వారు చేసిన పోరాటాలు సాధించిన విజయాలపై , ఉపాధ్యాయుల కోసం చేసిన కృషి పై సమీక్షించారు. అనంతరం టిపిటిఎఫ్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ వ్యవహరించగా, ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి వ్యవహరించారు. అధ్యక్షులుగా సిహెచ్ అనిల్ కుమార్, ఉపాధ్యక్షులుగా కే నలినిదేవి, టి శ్రీనివాస్, జి రాజశేఖర్, కె శ్రీనివాస్, డాక్టర్ పి నాగభూషణం, ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ లింగం, సహయ కార్యదర్శులుగా సిహెచ్ లక్ష్మి, పి విజయశ్రీ, సిహెచ్ నాగేంద్ర ప్రసాద్, కే నాగేందర్, గోపు శ్రీనివాస్, ఏ కృష్ణ, బి రూప్ సింగ్ లను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తాము ఎల్లప్పుడూ ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతూనే ఉంటామన్నారు. ఉపాధ్యాయులకు ఈ సమస్య వచ్చినా తమ సంఘం ముందుండి వాటి పరిష్కారానికి పోరాడుతుందన్నారు.