
నవతెలంగాణ-నెల్లికుదురు : మండలంలోని జడ్.పి.హెచ్.ఎస్ ఆలేరు ప్రభుత్వ పాఠశాలలో టి పి టి ఎఫ్ సంగం నూతన క్యాలెండర్లు డైరీలను గురువారం ఆవిష్కరించినట్లు టి పి టి ఎఫ్ మండల బాధ్యుడు సంఘ శ్రీనివాస్ ఎం ఎన్ ఓ రామదాసు తెలిపాడు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మండల బాధ్యులు సంఘ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యారంగంలో అనేక సమస్యలు గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయని నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలైన సిపిఎస్ రద్దు పెండింగ్ ఢిల్లీలో చెల్లింపుల వంటి సమస్యలు పరిష్కరిస్తూ, విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ఉపాధ్యాయ ఖాళీలను సత్వరమే భర్తీ చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు జి .ఉదయ్ కిరణ్ ,కే. బిక్షపతి, బిక్షపతి, నర్సయ్య, అనిత, స్రవంతి, హరినాథ్, జబ్బర్ మరియు శేఖర్ తదితరులు పాల్గొన్నారు