టీపీటీఎఫ్ మహాసభలకు ఉవ్వెత్తున తరలిరావాలి

– జిల్లా ఉపాధ్యక్షుడు జోగా రాంబాబు 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఖమ్మం జిల్లా కేంద్రంలో నేటి నుంచి టీపీటీఎఫ్ రాష్ట్ర ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహాసభలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఉపాధ్యాయులు ఉవ్వెత్తున తరలిరావాలని టీపీటీఎఫ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జోగా రాంబాబు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రములో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..విద్యారంగ, సామాజిక సమకాలీన పరిస్థితుల అవగాహన, ఉపాధ్యాయుల చైతన్యం కోసం 2017జనవరిలో సిద్దిపేటలో మొదటి రాష్ట్ర మహాసభలను నిర్వహించిన విధంగానే రెండవ విద్యా వైజ్ఞానిక మహా సభలు నేటి నుంచి రోజుల పాటు ఖమ్మం పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ మహాసభలు ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతాయని తెలిపారు. ప్రజల పక్షాన నిలబెడతాయని, ఆచరణ సాధ్యమైన ఆలోచనలను రేకెత్తిస్తాయని, విద్యారంగ పరిరక్షణకై, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రసంగాలు ఊతమిస్తాయని వ్యాఖ్యానించారు. వినూత్న బోధనకు విభిన్న పద్ధతులు, విద్యారంగ అంశాలే ఎజెండాగా చేసుకుని విద్యాభివృద్ధికి దోహదపడేలా ప్రభుత్వానికి నివేదనలు అందించేందుకు మండలం నుండి ఉపాధ్యాయులు ఉద్యమ కెరటాలై రావాలని కోరారు.