నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 317 జీవోపై మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం పొందిన 13 జిల్లాల స్పౌజ్ టీచర్ల బదిలీలను వెంటనే చేపట్టాలని టీపీటీఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది. శుక్రవారం హైదరాబాద్‌లో టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఎన్ తిరుపతి ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్జీటీలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని తెలిపారు. సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన వ్యవహారంలో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల సస్పెన్షన్లను ఎత్తేయాలని కోరారు.