
తెలంగాణా రాష్ర్రంలో సిద్దిపేట జిల్లా ఐఐటి బాసరలో అత్యధికంగా 377 సీట్లు సాధించి అగ్రస్థానంలో నిలవగా, సిద్దిపేట జిల్లాలో చిన్నకోడూరు మండలం ఐఐటి బాసరలో 47 సీట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. చిన్నకోడూరు మండలం ప్రథమ స్థానం సాధించడానికి అవిరాళంగా కృషి చేసినారని, అదే విధంగా వచ్చే విద్యా సంవత్సరం కూడా ఇదే విధమైన స్ఫూర్తితో ముందుకెళ్లాలని, ప్రధానోపాధ్యాయులందరికీ టిపియుఎస్ చిన్నకోడూరు మండల అధ్యక్షులు గడ్డం దేవదాస్ అభినందనలు తెలిపారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా చిన్నకోడూరు మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డిని టిపియుఎస్ మండల పక్షాన సన్మానించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బైతి భాస్కర్, మండల బాధ్యులు నందకుమార్, గుండ్లరాజు తదితరులు పాల్గొన్నారు.