జాడలేని వ్యవసాయ అధికారులు

– తెగుళ్లతో ఇబ్బందులు పడుతున్న వరి రైతు
– అధిక ధరలకు యూరియా అమ్ముతున్న ప్రైవేట్ వ్యాపారులు
నవతెలంగాణ – తొర్రూర్ రూరల్
ఈ సంవత్సరం రబి సీజన్లో వరి రైతుకు ఎప్పుడు లేని తెగుళ్లతో ఇబ్బందులు పడుతున్న వ్యవసాయ అధికారులు నిరంతరం గ్రామాల్లో పర్యవేక్షించాల్సి ఉన్న ఎవరు పట్టించుకోవడంలేదని రైతులు గ్రామాల్లోని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుపుతున్నారు. ఈ సంవత్సరం రబి సీజన్లో వేసిన వరి పంటకు వేసిన 15 రోజుల్లోనే ఎర్ర తెంపు తెగులు, పురుగు రావడంతో పంట కోలుకోలేని స్థితిలో ఏర్పడి వరి చనిపోతుందని గ్రామాల్లోని రైతులు తెలుపుతున్నారు. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లాలో 12 వేల ఎకరాల్లో వరి సాగు కాగా డిసెంబర్ నెలలో వేసిన రైతులకు తెగులు తక్కువగా రావడంతో పంట పెరుగుతుంది. కానీ జనవరి నెలలో వేసిన వరి నాటు తెగులు గురి కావడంతో పంట కోలకోలేని పరిస్థితిలో ఉంది నివారణ చర్యల కోసం రైతులకు సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ అధికారులు జడ లేకుండా పోయి, అందుబాటులోకి రాక రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులు చెప్పిన మందులను పిచికారి చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు నివారణ చర్యలు చేపట్టి, రైతులకు ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామాల్లోని రైతులు కోరుతున్నారు. నిరంతరం పంటలను పర్యవేక్షించాల్సిన అధికారులు నెల నెల ప్రభుత్వం ఇచ్చే జీతాలు తీసుకుంటూ రైతు వేదికల వద్ద ఒక గంట సేపు కాలం గడిపి ఇంటికి వెళ్తున్నారు గ్రామాల్లోని ఒకరిద్దరు రైతులను కలుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ మేము డ్యూటీ చేస్తున్నామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. గ్రామాల్లో కనీసం రోజు పంట పొలాలను పైరులను పర్యవేక్షించి  రైతులను కలిసి పంటలపై సూచనలు సలహాలు ఇవ్వాల్సి అవసరం ఉంది. తిష్ట వేసిన మండల వ్యవసాయ అధికారులు. జిల్లాలో మండలానికి వ్యవసాయ అధికారి ఉండగా గత 15 నుండి 20 సంవత్సరాలు గా ఓకే మండలంలో పనిచేస్తూ ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం బదిలీలు చేయక గ్రామాల్లోని నాయకులను మంచిగా చేసుకుంటూ వ్యాపారస్తులు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడుతూ ఏ ఒక్క వ్యాపారస్తులపై చర్యలు తీసుకోకుండా అధిక ధరలకు యూరియా అమ్ముతున్న పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఫర్టిలైజర్ వ్యాపారస్తులు ఒక యూరియా బస్తా 320 నుంచి 300 రూపాయల వరకు అమ్ముతున్న పట్టించుకోవడంలేదని రైతులు తెలుపుతున్నారు యూరియాకు బదులు ఏదైనా పురుగుమందులు కొంటేనే యూరియా ఇస్తామని లింకు పెడుతూ రైతులను నట్టేట ముంచుతున్నారు. మరియు ప్రభుత్వ రంగ సంస్థలైన సహకార సొసైటీలకు యూరియా ఇవ్వకుండా ప్రైవేటు వ్యాపారస్తులకు ఇస్తూ డ్యామేజ్ అయిన బస్తాలను సహకార సొసైటీలకు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని సొసైటీలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పర్యవేక్షించి ఈ ప్రభుత్వంలోనైనా రైతులకు న్యాయం జరగాలని రైతులు కోరుచున్నారు .వ్యవసాయ అధికారులు నిరంతరం పంట పొలాలను పరిశీలించాలి.
గాండ్ల సుధాకర్ రైతు రామన్నగూడెం: గ్రామాల్లోని రైతులకు సూచనలు సలహాలు ఇస్తూ పెట్టుబడి తగ్గిస్తూ సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ అధిక దిగుబడులు రావడానికి రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు గ్రామాల్లో పర్యవేక్షించకపోవడం తో పాటు ఏ మందులు పిచికారి చేయాలి ఏ పంటలు వేసుకోవాలి అని చెప్పే అధికారులు లేకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు పరిశీలించి అధికారులను బదిలీలు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే 15 నుండి 20 సంవత్సరాలుగా ఓకే మండలంలో పనిచేస్తున్నారు.