ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

నవతెలంగాణ – రామారెడ్డి
అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్థానిక పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమంగా స్కూల్ తండా నుండి రెడ్డిపేట వైపు ఇసుక విక్రయానికి తరలిస్తుండగా రెడ్డిపేటలోని ఘనపూర్ రోడ్డు వద్ద స్థానిక పోలీసులు పట్టుకొని, పోలీస్ స్టేషన్ కు తరలించి, ఇసుక తరలిస్తున్న సలావత్ రామి, సలావత్ శ్రీనివాస్, గంగావత్ రాజు లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ తెలిపారు.