రెంజల్ మండలంలోని పోలీస్ స్టేషన్, తాసిల్దార్ కార్యాలయం మధ్యలో తనిఖీలు చేస్తుండగా, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెండు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. వ్యవసాయ పనిముట్లు సంబంధించిన ఈ ట్రక్టర్లు రోడ్డుపై ఇసుకను తరలిస్తుండగా వాటిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ తనిఖీలలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎస్సై ఈ .సాయన్న, ఎంవిఐ శ్రీనివాస్, ఆర్ ఐ రవికుమార్ తదితరులు ఉన్నారు.