ట్రేడ్ కార్పొరేషన్ ఛైర్మన్‌ ప్రకాష్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుల సన్మానం

నవతెలంగాణ –మల్హర్ రావు:
రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆశీస్సులతో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టిన అయిత ప్రకాష్ రెడ్డిని మండల కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి రాజు గౌడ్, ఇందారపు చెంద్రయ్య, దన్నపనేని సురేష్ రావు, ఆర్ని ఉదయ్ తదితరులు  శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువా, పూలమాలతో ఘనంగా సత్కారించి శుభాకాంక్షలు తెలిపారు.