చదువుతో పాటు సాంప్రదాయ కలలు అవసరం

చదువుతో పాటు సాంప్రదాయ కలలు అవసరం– రెండు రోజులు మురిపించి ముగిసిన
– జాతీయ స్థాయి నాటక వేడుకలు
– ప్రశంసలు అందుకున్న సంస్కార భారతి,నవకళాభారతి సంస్థలు
నవతెలంగాణ-షాద్‌నగర్‌
చదువుతోపాటు సాంప్రదాయ కలలు అవసరం, అలాంటి నాటకారంగానికి మొక్కగా ఉన్న దశలోనే ఊపిరి పోసి చిగురింప చేశారు. కళాకారుల్లో ఆశ అంతరించిపోతున్న సంప్రదాయ కళలను తిరిగి అంకురింపజేసి కళా సంస్థలు ప్రాణం పోస్తే, అత్యద్భుతమైన తమ నటన ప్రతిభతో చిన్నారులు వారి ఆశలకు జీవం పోశారు. షాద్‌నగర్‌ పట్టణంలోని హాజీపల్లి రోడ్డులో గల ఏవి కన్వెన్షన్‌ హాల్లో గత రెండు రోజులుగా నాలుగు రాష్ట్రాలకు జరిగిన నాటక ఉత్సవాలు మంగళవారంతో అట్టహాసంగా ముగిశాయి. నాటక రంగానికి దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న సంస్కార భారతి, నవ కళాభారతి సంస్థల ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జరిగిన ఈ నాటక పోటీలలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌తో పాటు, మధ్యప్రదేశ్‌, బెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన బాల కళాకారులు పాల్గొనడం విశేషం. కళాకారుడు, సంస్కార భారతి నిర్వాహకుడు, సెంట్రల్‌ సినీ సెన్సార్‌ బోర్డు సభ్యులు టీవీ రంగయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన తీరు మారాలి, మాకు స్వతంత్రం కావాలి నాటికలతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేసిన ప్రపంచ తంత్రం, నమస్కార్‌ జి నమస్కార్‌, బాల భారతం వంటి నాటకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నాటకోత్సవాలలో పాల్గొన్న విద్యార్థులకు బాల కళాశ్రీ, పెద్దలకు కళాశ్రీ బిరుదులతో సంస్థ నిర్వాహకులు సత్కరించారు.
జాతీయ స్థాయిలో ఈ నాటకాన్ని నిర్వహించడంలో ఉద్దేశం వివిధ రాష్ట్రాలలో ఉన్న కళాకారులు అందరిని ఒక వేదికపైకి తెచ్చి ఒకరితో ఉన్న ప్రతిభను ఇంకొక్కరికి బదిలీ చేసి వారిని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దాలన్న ఉద్దేశమే అని బాలలు కొనియాడారు. కార్యక్రమంలో కళాకారులు కొమరం, అంజి, లక్ష్మీ కిరణ్‌, సునామీ సుధాకర్‌, కల్కి లాంటి చిత్రాల డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ ఆర్‌ సిఎం రాజు, గుండు మురళి, కాశీనాథ్‌ రావు, మోహన్‌ గాంధీ, డాక్టర్‌ త్రినాధ రావు, వడ్ల రమేష్‌ చారి, రవీందర్‌ శివ, ప్రమోద్‌ కుమార్‌, నవీన్‌ కుమార్‌, సాయి కష్ణ, శ్రీ రాజు కోట్ల, ప్రణీత రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.