ప్రయాణికులందరికీ అందరూ ప్రయాణికులకు రేపు(మంగళవారం), ఎల్లుండి(బుధవారం) గణేష్ నిమజ్జనాలు ఉన్నందున బాసర గోదావరి బ్రిడ్జి పై నుండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు అనుమతి లేదని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ నుండి బాసర వైపు వెళ్లే వాహనాలు నవీపేట్ శివాజీ చౌక్ నుండి కలియాపూర్,దండిగుట్ట ,వీరన్న గుట్ట ,రెంజల్ కమాన్ ఎక్స్ రోడ్, సాటపూర్ ఎక్స్ రోడ్, నీల, నీలా పేపర్ మిల్, కందకుర్తి బ్రిడ్జి మీదుగా ధర్మాబాద్ గుండా బిద్రెల్లి నుండి బాసరకు వెళ్లాలని సూచించారు. అలాగే బాసర వైపు నుండి నిజాంబాద్ వచ్చే వాహనాలు బిబ్రేల్లి నుండి ధర్మాబాద్ మీదుగా కందకుర్తి, రెంజల్ నుండి నిజామాబాద్ వైపు వెళ్లాలని సూచించారు. మంగళవారం, బుధవారం రెండు రోజులు బాసర గోదావరి బ్రిడ్జి మీద గణేష్ నిమజ్జనాలు ఉన్నందున నిమజ్జనానికి వచ్చే గణేశుడితో పాటు కూడిన వాహనాలు మాత్రమే అనుమతించబడతాయని అన్నారు. అలాగే గణేష్ నిమజ్జనం అయిన తర్వాత నిమజ్జనం పూర్తి చేసుకున్న వాహనాలు నేరుగా బాసర మీదుగా బిదిరెల్లి నుండి ధర్మాబాద్ మీదుగా కందకుర్తి వైపు నుండి రెంజల్ మీదుగా నిజాంబాద్ చేరుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కోరారు. ప్రజలు, ప్రయాణికులు అందరూ ట్రాఫిక్ డైవర్షన్ పాటిస్తూ, గణేష్ నిమజ్జనోత్సవానికి సహకరించాలని కోరారు.