
పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు శుక్రవారం కొనసాగుతాయని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. ఉదయం 09 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంట వరకు ఎమ్మెల్యే పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి ర్యాలీ సందర్భంగా ఆర్మూర్ టౌన్ నందు ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు కలవు అవి 1.నిర్మల్, మెట్ పల్లి వైపు నుండి ఆర్మూర్,నిజామాబాద్ వచ్చు వాహనదారులు పెర్కిట్ 44 నంబరు జాతీయ రహదారి మీదుగా గోవింద్‌పేట్ రోడ్డు నుండి నిజామాబాద్ వెళ్లాలి అని అన్నారు. నిజామాబాద్ నుండి మెట్ పల్లి ,నిర్మల్ వైపు వెళ్ళు వాహనాలు అంకాపూర్ గ్రామం మీదుగా అర్గుల్ గ్రామ శివారులోని జాతీయ రహదారి రోడ్డు వైపు వెళ్లాలి. అని ఆర్మూర్ వైపు నుండి పెర్కిట్ మెట్ పల్లి వైపు వెళ్ళు వాహనదారులు మామిడిపల్లి చౌరస్తా మీదుగా గోవింద్ పెట్ హైవే బ్రిడ్జి వైపు నుండి వెళ్లవలసిందిగా తెలిపారు.