నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
షాపూర్ నగర్ హమాలి సంఘం కార్మికులు షాపూర్ నగర్ అడ్డ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులతో కలిసి సూరారం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్మికులే కలిసి ఎండాకాలంలో ప్రజల దాహార్తి తీర్చడానికి స్వచ్చందంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అందరు కలిసి మెలిసి ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల మంచి వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. ప్రతీ ఒక్కరు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జన సంచారం అధికంగా ఉన్నచోట మరిన్ని చలివేంద్రాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, సీపీఎం కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ హమాలి కార్మికులు ఒక కుటుంబంగా జీవిస్తూ, తమ సంపాదనలో చేతనైనంత సహాయం ఇతరులకు చెయ్యడం ఒక గొప్ప విషయం అని కోనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు స్వామి, సీఐటీయూ నాయకులు దేవదానం, ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్, డీవై ఎఫ్‌ఐ నాయకులు అంజయ్య, ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు నర్సింహారెడ్డి, మహేందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
వివేకానంద విద్యా మందిర హై స్కూల్, క్లేటన్ ప్రీ-స్కూల్ విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్..
కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని వివేకానంద విద్యా మందిర్ హై స్కూల్ లో ప్రీ-స్కూల్ విద్యార్థులకు బుధవారం గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థిగా సురారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్, ప్రధానో పాధ్యాయులు మండవ.శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ముందు గా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ… నేటి పిల్లలు చాలా అడ్వాన్స్ గా ఉన్నారని వారి కంటే ఉపాధ్యాయులు ఇంకా బెటర్ గా ఆలోచన చేసి విద్యను అందించాలన్నారు. విద్యారు ్థలకు చిన్నతనం నుంచే నైతిక విలువలు, క్రమశిక్షణ, శ్రద్ధ వంటి లక్షణాలను నేర్పుతూ ఉత్తమ పిల్లలుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని కోరారు. అనంతరం యూ.కే.జీ పిల్లలకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. చిన్నారి విద్యార్థులు సాం స్కతిక కార్యక్రమాలతో సందడి చేశారు. ఈ కార్యక్ర మంలో భాగంగా వివేకానంద విద్యా మందిర్ సంస్థల చైర్మెన్ మండవ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత వహించగా కరెస్పాండెంట్ ఎం.సునీత వైస్ ప్రిన్సిపాల్ పి.లత ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.