ఫతేపూర్‌ రోడ్డుపై గుంతలను పూడ్చిన ట్రాఫిక్‌ పోలీసులు

ఫతేపూర్‌ రోడ్డుపై గుంతలను పూడ్చిన ట్రాఫిక్‌ పోలీసులునవతెలంగాణ-శంకర్‌పల్లి
రోడ్డుపై గుంతలు ఉండటంతో వాహనాదారులకు రాకపోకలకు ఇబ్బంగా మారుతుందనీ, ట్రాఫిక్‌ పోలీసులు ఆ రోడ్డుపై ఉన్న గుంతల్లో సోమవారం మొరం పోసి పూడ్చి వేశారు. ఆర్‌అండ్‌బీ అధికారులు చేపట్టవలసిన పనులను ట్రాఫిక్‌ పోలీసులు చేయడంతో పలువురు వారిని అభినందనించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ సీఐ వెంకటేశం మాట్లాడుతూ శంకర్‌పల్లి పట్టణంలో ఫతేపూర్‌ రోడ్‌లో రోడ్డుపై గుంతలమయం కావడంతో వాహన దారులు ఎన్నో ప్రమాదాలు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చీటికిమాటికి ట్రాఫిక్‌ కూడా జామ్‌ అవుతున్న నేపథ్యంలో గంటల తరబడి వాహనాదారులు ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. రోడ్డుపై పడ్డ గుంతలను పూడ్చడం వల్ల ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం చేయవచ్చనే ఉద్దేశంతోనే ఆ గుంతల్లో మోరం పోయించి చదును చేసినట్టు తెలిపారు. ట్రాఫిక్‌ సిబ్బంది రోడ్డుపై పడ్డ గుంతలను పూడ్చడంతో స్థానికులతో పాటు, మండలానికి చెందిన వాహన దారులు,సంతోషం వ్యక్తం చేశారు. ఆర్‌అండ్‌బీ వాళ్లు చేయాల్సిన పనులు ట్రాఫిక్‌ పోలీసులు చేశారని అభినందించారు. ఇప్పటికైనా సంబంధిత ఆర్‌ అండ్‌బీ అధికారులు స్పందించి ఈ రోడ్డును శాశ్వత మరమ్మతులు చేపట్టాలని పలువురు వాహనదారులు కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, సి అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.