నేడు జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలు

నవతెలంగాణ- కంటేశ్వర్
అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా నిజామాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్,  ఆర్మూర్ , బోధన్ డివిజన్ లో ట్రాఫిక్ ఆంక్షలు తూలచా  తప్పకుండా ప్రజలు పాటించగలరు అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. తేదీ 22-1-2024 నాడు ఉదయం 6 గంటల నుండి తేది 23-1-2024 నాడు ఉదయం 6గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు గలవు అని తెలియజేశారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ  పోలీసు వారికి సహకరించాలన్నారు. పోలీసులు తెలిపిన దాని ప్రకారంగా దేవాలయాల పరిధిలో 1కిలోమీటర్ పరిధి వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు.  నిజామాబాద్ డివిజన్లో  హైమది బజార్ లోని శంబుని గుడి, వీక్లీ మార్కెట్ లోని గోల్ హనుమాన్ , ఖిల్లా రఘునాథ్ ఆలయం, ఆర్మూర్ డివిజన్లోని కన్యకా పరమేశ్వరి ఆలయం, రాంనగర్ రామాలయం మందిరం, బోధన్ డివిజన్లోని  రామాలయం బోధన్, మారుతి మందిర్, రాకాసిపేట్ హనుమాన్ దేవాలయం, ఏక చక్రేశ్వర స్వామి దేవాలయం, కావున ప్రజలందరూ ఎల్లప్పుడూ పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలియజేశారు.