– నిజామాబాద్ సహాయక కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ నారాయణ
నవతెలంగాణ – కంఠేశ్వర్
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో దారి మళ్లింపు( ట్రాఫిక్ ఆంక్షలు) చర్యలు చేపట్టడం జరిగిందని నిజామాబాద్ సహాయక కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ నారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ సహాయక కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ నారాయణ మాట్లాడుతూ.. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ నగర ప్రజలకు దారిమల్లింపు మార్గాలను గమనించాలని తెలిపారు. ఈ నెల తేదీ 16-9-2024 నాడు ఉదయము 7 గంటల నుంచి మధ్యాహ్నము 1 గంటల వరకు మిలాద్-ఉన్-నబీ ఉన్నందున కొన్ని మార్గాలలో దారి మళ్లింపు చేయడం జరిగిందన్నారు. బోధన్ వైపు నుండి వచ్చే వాహనాలు అర్సపల్లి చౌరస్తా, అర్సపల్లి రైల్వే గేట్, న్యూ కలెక్టరేట్, కాలూర్ చౌరస్తా, ఖాజా హోటల్, బైపాస్, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా ఆర్టీసీ బస్టాండ్ చేరుకోవాలి అని తెలియజేశారు. బోధన్ వైపు వెళ్ళు వాహనాలు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే ఫ్లై ఓవర్, శివాజీ చౌక్, నిజాం కాలనీ, అర్సపల్లి రైల్వే గేట్ మీదుగా బోధన్ వైపు వెళ్లాలి అని తెలియజేశారు. కావున నగర ప్రజలు ఇట్టి విషయాన్ని గమనిస్తూ ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించగలరని కోరుతున్నామన్నారు.