ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి పాటించాలి ..

Traffic rules must be followed.– నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేసిన ట్రాఫిక్ ఎస్ఐ

– చైన్ స్నాచింగ్, ప్రమాదాలను నివారించేందుకు పయత్నం
– కామారెడ్డి ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ 
నవతెలంగాణ –  కామారెడ్డి 
కామారెడ్డి పట్టణంలో చైన్ స్నాచింగ్, ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నట్లు కామారెడ్డి ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ అన్నారు. శనివారం కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రాంతాలలో నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో ముఖ్యంగా అతివేగాన్ని,రోడ్డు ప్రమాదాలను నివారించే భాగంలోనే ఈ లాంటి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. పట్టణంలో పలువురు యువకులు అతివేగంతో అజాగ్రత్తగా వాహనం నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. అలాంటి వారిని పట్టుకునేందుకు నెంబర్ ప్లేట్లు ఉంటే సిసి కెమెరాలు చూసి పట్టుకోవడం సులభతరం అవుతుందన్నారు. అందుకే ఈ ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ద్విచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్లను తప్పనిసరిగా బిగించుకోవాలని ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు సూచిస్తున్నానన్నారు.