ట్రాఫిక్‌ సిగల్స్‌ను వెంటనే రిపేర్‌ చేయాలి

– సీపీఐ(ఎం) కూకట్‌పల్లి మండల కార్యదర్శి ఎం శంకర్‌
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
హైదర్‌నగర్‌ ట్రాఫిక్‌ సిగల్‌ను వెంటనే రిపేర్‌ చేయా లని సీపీఐ(ఎం) కూకట్‌పల్లి మండల కార్యదర్శి ఎం శంకర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం హైదర్‌నగర్‌ ట్రాఫిక్‌ సిగల్‌ వద్ద సీపీఐ(ఎం) నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా హైదర్‌నగర్‌ బస్తీ మెయిన్‌ రోడ్‌ వద్ద సిగల్‌ రానందువల్ల స్థానిక ప్రజలు రోడ్డు దాటడానికి తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయ మై ట్రాఫిక్‌ అధికారులకు, టెక్నీషియన్‌ ప్రదీప్‌ కుమార్‌కు నాలుగు రోజుల కిందటే విన్నవించినా నేటికీ సిగల్‌ను బాగు చేయలేదని తెలిపారు. కావున సీపీఐ(ఎం) ఆధ్వర్యం లో సిగల్‌ వద్ద నిరసన తెలుపుతున్నామన్నారు. ఇప్పటికైనా ప్రజల సౌకర్యార్థం అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కూకట్‌పల్లి మండల కార్యదర్శి ఎం శంకర్‌, పార్టీ నాయకులు ఎం శంకర్‌, బీ. శ్రీను, నరసింహ, వెంకటయ్య, అశోక్‌, మహేష్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.