పండుగ పూట విషాదం

పండుగ పూట విషాదం– మర్కుక్‌లో ప్రమాదవశాత్తు ప్రాజెక్టు కాల్వలో పడి ఇద్దరు విద్యార్థుల మృతి
నవతెలంగాణ-మర్కుక్‌
ప్రమాదవశాత్తు కొండపోచమ్మ ప్రాజెక్టు కాల్వలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా మర్కుక్‌లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మర్కుక్‌ ఎస్‌ఐ శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం పాఠశాలకు సెలవు దినం కావడంతో మర్కుక్‌ గ్రామానికి చెందిన చల్లా సంపత్‌(13), మైసిగారి వినరు(12), అచ్చంగారి రాజు.. ముగ్గురూ కలిసి ఉదయం కొండపోచమ్మ ప్రాజెక్టు వైపు వాకింగ్‌కు వెళ్లారు. అనంతరం ప్రాజెక్టు సంపుహౌజ్‌ కాల్వ వద్ద కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లగా.. సంపత్‌, వినరు కాలు జారి కాల్వలో పడిపోయారు. కాల్వ గట్టు మీద ఉన్న రాజు ఇది గమనించి కాపాడటానికి ప్రయత్నం చేయగా.. అప్పటికే ఇద్దరూ నీట మునిగిపో యారు. దాంతో పరుగుగెత్తుకుం టూ గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించా రు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. గజ్వేల్‌ ఏసీపీ రమేష్‌, మర్కుక్‌ ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్రామస్తులు, గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మర్కుక్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.