హఫిజ్‌ పేట్‌ ఆదిత్య ఫార్చున్‌ హైట్స్‌లో విషాదం

హఫిజ్‌ పేట్‌ ఆదిత్య ఫార్చున్‌ హైట్స్‌లో విషాదం– ఒకరు మృతి ,మరో ఇద్దరికి గాయాలు
– నిర్మాణ కంపెనీ నిర్లక్షం వల్లే చనిపోయాడని బంధువుల ఆరోపణ
– మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన
నవతెలంగాణ-మియాపూర్‌
నిర్మాణంలో ఉన్న భవనంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్‌ కేబుల్‌తెగి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. మృతుని బంధు వులు తెలిపిన వివరాల ప్రకారం.. హఫిజ్‌పేట్‌ మంజీర రోడ్డులో ఆదిత్య ఫార్చున్‌ హైట్స్‌ పేరుతో హై రై స్‌ బిల్డింగ్‌ నిర్మిస్తున్నారు. అదే కంపెనీలో ఉప్పల లక్ష్మీనారా యణ (56) సైట్‌ ఇంజనీర్‌గా 10 ఏండ్లు గా పనిచేస్తున్నాడు. స్థానిక గచ్చిబౌ లిలోని అంజనారులో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉద యం నిర్మాణంలో ఉన్న భవనంపైకి లక్ష్మీనారాయణ పనిమీద వెళ్ళాడు. అయితే ఈ క్రమంలో 9వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు లిఫ్ట్‌ కేబుల్‌ తెగి కింద పడ డంతో లక్ష్మీనా రాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరికికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుని కుమారుడు ఉదరు కంపె నీ నిర్లక్ష్యం వల్లే తన తండ్రి మృతి చెందాడని పోలీసులు కూడా కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.