ఊరట్టం ఆశ్రమ పాఠశాలలో విషాదం.. బ్రెయిన్ స్ట్రోక్ తో ఉపాధ్యాయుడు మృతి

నవతెలంగాణ -తాడ్వాయి: ములుగు జిల్లాలోని ఊరట్టం ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు. ఊరట్టం పాఠశాలలో శనివారం విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు కొప్పుల విశ్వనాథం(50) శనివారం ఉదయం ఉన్నట్టు ఉండి బ్రెయిన్ స్ట్రోక్ తో కుప్ప కూలిపోయాడు. మెరుగైన చికిత్స కోసం హన్మకొండలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో వైద్యం చేయించారు. వైద్యం పొందుతూ ఈరోజు మంగళవారం ఉదయం 7.30 గం. సమయంలో మృతి చెందారు. దీంతో ఆయన పుట్టిన ఊరు కాల్వపల్లి, విధులు నిర్వహిస్తున్న ఊరు ఊరట్టం, పసర తదితర గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇతనికి భార్య సత్యవతి, ఇద్దరు కుమారులు, ఒక అమ్మాయి లు ఉన్నారు. వీరి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఆదివాసీ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి