తిరుమలలో విషాదం..

– ఆరేళ్ల చిన్నారిని చంపేసిన చిరుత..!
తిరుపతి : అలిపిరి నడకదారిలో లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి తప్పిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన తిరుమలకు వస్తున్న సమయంలో లక్షిత తప్పిపోయింది. పాప కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారి కోసం పోలీసులు గాలించగా.. ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహం లభించింది. ఒంటిపై గాయాలు ఉండటంతో పాపను చిరుత చంపేసి ఉంటుందని భావిస్తున్నారు. నెల క్రితం ఓ బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రాంతంలోనే చిన్నారి కూడా తప్పిపోవడం గమనార్హం.