వైజాగ్‌లో ట్రైలర్‌ లాంచ్‌

వైజాగ్‌లో ట్రైలర్‌ లాంచ్‌రామ్‌ పోతినేని, డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ మోస్ట్‌ ఎవెయిటింగ్‌ హై-బడ్జెట్‌ పాన్‌ ఇండియా మూవీ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. దీని థియేట్రికల్‌ ట్రైలర్‌ ఈవెంట్‌ను ఈనెల 4న వైజాగ్‌లోని గురజాడ కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు.పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంజరు దత్‌, కావ్యా థాపర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.