నవతెలంగాణ ఆర్మూర్
మండలంలోని అంకాపూర్ గ్రామానికి మంగళవారం ట్రైన్ అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్ సందర్శించినారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీలో రికార్డులను పరిశీలించినారు. కేంద్రం ,రాష్ట్రం నిధులు ఏ విధంగా ఉపయోగిస్తున్నారని, మహిళా సంఘాలకు రుణాలు, అంగన్వాడి కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పల్లె పకృతి వనం ను సందర్శించినారు .ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయిరాం, ఎంపీ ఓ శ్రీనివాస్, ఏపీఎం సురేష్, పంచాయితీ సెక్రటరీ హారిక తదితరులు పాల్గొన్నారు.