పిఓలకు శిక్షణ ఇవ్వండి

– హైదరాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి
నవతెలంగాణ-సీటీబ్యూరో
పార్లమెంట్‌ ఎన్నికలను సజావుగా, సునయాసంగా నిర్వహిం చి విజయవంతం చేసేలా పిఓలు, ఏపీఓలకు సరియైన శిక్షణ ఇవ్వాలని హైదరాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అసెంబ్లీ లెవెల్‌ మాస్టర్‌ ట్రైనర్లకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఏఆర్‌ఓ, ఏఎల్‌ఎం ఎస్‌లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్ని కలలో ఏఎల్‌ఎంఎస్‌లు క్రియాశీలక పాత్ర నిర్వహించి నారని, ఎంతో బాగా పనిచేశారని అభినందించారు. పార్ల మెంట్‌ ఎన్నికలలో కూడా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. జీవోలు ఏపీవోలు ఎన్నికలను సునా యాసంగా నిర్వహించేలా సరియైన శిక్షణ ఇవ్వాలన్నారు. థియరీ కంటే ఆచరణాత్మక (ప్రాక్టికల్‌) శిక్షణకు అధిక సమయం ఇవ్వాలని సూచించారు. ఎన్నికల రోజు( పోల్‌ డే), ఎన్నికల ముందు రోజు(ప్రీ పోల్‌ డే ) రోజు ఏ ఏ పంపాలి, ఎన్నికల ఫారములు ఎలా నింపాలి, పోల్‌ డైరీ,17 సి,17 ఏ ఫారం, ముఖ్య మైన ఫారాలు ఎలా నింపాలి, టెండర్‌ ఓట్లు, రికార్డెడ్‌ ఓట్లు, పోస్టల్‌ ఓట్లు, ఈవీఎం, పోల్‌ డైరీ, మాక్‌ పోల్‌ సర్టిఫికెట్‌ ఫారమ్స్‌ నింప డంలో పిఓలకు, ఎపిఓ లకు సరియైన శిక్షణ ఇవ్వాలని అయన సూచించారు. థియరీ కంటే ప్రాక్టికల్‌ శిక్షణ కు ఎక్కువ సమయం ఇస్తే సులువుగా అర్థమవుతుందన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ ఓ వెంకటాచారి, ఈ డిఎం రజిత, ఎలక్షన్‌ తాసిల్దార్‌ జహు రుద్దీన్‌, ఏఆర్‌ఓలు, ఏఎల్‌ఎంటిలు తదితరులు పాల్గొన్నారు.