నూతన విద్యా విధానంపై అంగన్ వాడి టీచర్లకు శిక్షణ తరగతులు: సీడీపీఓ

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంపై (రివైజెడ్ సిలబస్) మండలంలోని అంగన్ వాడి టీచర్లకు మాస్టర్ ట్రైనర్స్ తో శిక్షణ తరగతులు కొయ్యుర్ కమ్యూనిటీ హాల్లో మండల సూపర్ వైజర్ సరస్వతి ఆధ్వర్యంలో  నిర్వహించినట్లుగా మహాదేవపూర్ ప్రాజెక్టు సీడీపీఓ రాధిక తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. శిక్షణ తరగతులు మండలంలో మూడు రోజులపాటుగా కొనసాగినట్లుగా తెలిపారు. ఈ శిక్షణ తరగతుల్లో చిన్నారులకు సులబతరంగా బోధించడంపై, ఆటపాటలతో చదువు చెప్పడం, మూడు రోజులు డే వాయిస్, ఆక్టివ్ వాయిస్ చేయించడం జరిగిందన్నారు. కార్నర్ సమావేశాలు ఏర్పాటు చేసి తరగతి వాతావరణం, సిలబస్ ప్రకారం కథలు,పాటలు, సృజనాత్మకత తదితర అంశాలపై గ్రూపు వైజ్ గా ఇచ్చి యాక్టింగ్, చార్ట్స్ చేయించి ప్రదర్శన ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్స్ నాగరాని, జె వీణ,బాగ్యలక్ష్మీ, అంగన్ వాడి టీచర్లు పాల్గొన్నారు.