సీపీఐ(ఎం) కార్యకర్తల శిక్షణ తరగతులు మొదటి రోజు పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముందుగా పార్టీ జెండాను ఎగరవేసిన అనంతరం శిక్షణ తరగతులను ప్రారంభించారు. పని పద్ధతుల అనే అంశం పైన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ బోధించారు. ఇంట్లో ఉన్న మూఢనమ్మకాలు కులమత ప్రభావాలతోటి పేద ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని, శాస్త్రీయ దృక్పథంతో వాస్తవాలను గ్రహించే పద్ధతుల్లో ప్రజా సమస్యలను అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు నిర్మాణం కార్యక్రమం అంశం పైన కార్యకర్తలకు వివరించడం జరిగింది. సమాజంలో వర్గ పోరాటాల ద్వారా మాత్రమే ప్రజల అసలు నుండి విముక్తి లభిస్తుందని వర్గ పోరాటాల నిర్మాణంలో కర్తలు చురుకుగా పాల్గొని విప్లవ సాధన కోసం కృషి చేయాలని ఆయన అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు నన్నే షాప్, సుజాత, మోహన్ రావు, విగ్నేష్ తదితరులతోపాటు పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.