గ్రామపంచాయతీ మల్టీ వర్కర్స్ కు శిక్షణ తరగతులు

Training classes for gram panchayat multi workersనవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మండలంలోని వివిధ గ్రామపంచాయతీలలో పని చేయుచున్న నీటి సరఫరా నిర్వహణ సిబ్బంది కి నాలుగు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభించబడినవి. ఈ సందర్బంగా డి యల్ పి వో సురేందర్ మాట్లాడుతూ.. నీటి సరఫరా నిర్వహణ,లీకేజి లు,మైనర్ రిపేర్ లు ,క్లోరినేషన్, ట్యాంకుల శుభ్రపరచుట మరియు క్లోరినేషన్ కిట్ ల ద్వారా క్లోరిన్ టెస్ట్ చేయుట గురించి సూచించారు. ఈ కార్యక్రమంలో  డి ఎల్ పి వో  సురేందర్,
 ఆర్ డబుల్ ఎస్  డిఈ ప్రవీణ్ కుమార్, ఏం పి డి వో  రాజేశ్వర్, ఆర్ డబుల్ ఎస్ దామోదర్ రెడ్డి, ఆయా గ్రామాల వార్కర్ లు పాల్గొన్నారు.