ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభం

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండలంలో వివిధ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగిందని మండల విద్యా శాఖ అధికారి దేవిసింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ్తు ప్రాథమిక స్థాయి విద్యార్థులో విద్యాబ్యాసం స్థాయిని పెంపొందించుకొనే ఉదేశ్యంతో ప్రభుత్వం ఎఫ్.ఎల్.ఎన్. కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణ పై అవగాన కార్యక్రమం ఉందని అన్నారు.ప్రతి రోజు రెండు మద్యమలో కనీస సామర్థ్యం సాధనకై శిక్షణ కొనసాగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండలంలోని పెద్ద కొడపగల్ వడ్లమ్, కాంప్లెక్స్ ఉపాద్యాయులు, ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు చంద్రకాంత్, గణేష్ పాల్గొన్నారు.