ఇంకాపూర్ గ్రామాన్ని సందర్శించిన ట్రైనింగ్ కలెక్టర్

నవతెలంగాణ – ఆర్మూర్  

మండలంలోని అంకాపూర్ గ్రామంలో ట్రైనింగ్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి గురువారం వివిధ అంశాలపై క్షేత్రస్థాయి పర్యటన చేశారు. గ్రామపంచాయతీ ఆవరణలో ఐకెపి ఉపాధి హామీ కూలీలతో వారి యొక్క స్కీములపై ముఖాముఖిగా చర్చించారు. గ్రామంలోని బృహత్ పల్లె ప్రకృతి వనం మరియు నర్సరీని సందర్శించారు. అంతేగాక సీడ్ ప్రాసెసింగ్ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో డిఎల్పిఓ శివకృష్ణ, ఎంపీడీవో సాయిరాం, ఐ కె పి యం గంగారం, జక్రాన్పల్లి పీ ఓ ఖాన్, రైతు సంఘం మాజీ కార్యదర్శి కేకే బాజన్న, ఏపీవో సురేష్ పంచాయతీ సెక్రటరీ హారిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు.