నవతెలంగాణ-ఏర్గట్ల : మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన మెడికల్ ఆఫీసర్ రక్షిత రెడ్డి ఆధ్వర్యంలో, ఫిబ్రవరి 10 వ తేదీన జరుపబోయే జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని గురించి వైద్య సిబ్బందికి,అంగన్వాడీ టీచర్లకు గురువారం శిక్షణ ఇవ్వడం జరిగింది. 1 నుండి 19 సంవత్సరాల వయసు గల వారికి నులిపురుగుల నివారణ కోసం ఇచ్చే ఆల్బెండజోల్ మాత్రలు ఏ విధంగా ఉపయోగపడతాయో మెడికల్ ఆఫీసర్ ఈ సమావేశంలో వివరించారు.వైద్యులు ఇందిర, మోతీరాం, విజయ, హెల్త్ అసిస్టెంట్లు పండరీ,మోహన్ తదితరులు పాల్గొన్నారు.