తిమ్మాపూర్ పీహెచ్సీ లో టీబీ ఛాంపియన్స్ కి శిక్షణ  

Training for TB Champions at Timpapur PHC– టీబీ పై అపోహలు వద్దు
– టీబీని ఒడిద్దాం.. దేశాన్ని గెలిపిద్దామని హితవు 
– టీబీ అలర్ట్‌ ఇండియా ఇంపాక్ట్‌ స్టేట్ ఐఈసీ ఆఫీసర్ జితేందర్, జిల్లా క్షయ నిర్ములనాధికారి డా.. అరుణ్ కుమార్
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
టీబీ వ్యాధిపై గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు  టీబీ వారియర్స్ ఏర్పాటు చేసి వ్యాధి నిర్మూలన ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి సారిస్తోందని టీబీ అలర్ట్‌ ఇండియా ఇంపాక్ట్‌ స్టేట్ ఐఈసీ ఆఫీసర్ జితేందర్, జిల్లా క్షయ నిర్ములనాధికారి డా.. అరుణ్ కుమార్ అన్నారు.  టీబీ నివారణ మరియు సంరక్షణకై సమీకృత చర్యల్లో భాగంగా  మండల పరిధిలోని తిమ్మాపూర్ పీహెచ్‌సీలో  మంగళవారం  40 మంది టీబీ ఛాంపియన్స్ కి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీబి పై వచ్చే అపోహలను ప్రజలు నమ్మొద్దని, టీబీ రహిత జిల్లాగా సిద్దిపేటను తీర్చిదిద్దెందుకు పని చేస్తున్నామన్నారు. టీబీ ఛాంపియన్స్ ద్వారా గ్రామాల్లో టీబీ లక్షణాలు ఉన్న వారిని తొందర గుర్తించి చికిత్స అందించి, హాస్పిటల్లో ఉచితంగా మందులు అందజేస్తామన్నారు. టీబీని ఒడిద్దాం దేశాన్ని గెలిపిద్దామని పిలుపునిచ్చారు. అధిక వ్యాధి లక్షణాలున్నవారిని టీబీ ఛాంపియన్స్ గుర్తించి, ఆశా వర్కర్లకు గానీ, తిమ్మాపూర్ పీహెచ్సి వైద్యాధికారులకు సమాచారమివ్వాలన్నారు. టీబీ రహిత సమాజాన్ని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ  వైద్యాధికారుల హిమబిందు, సయ్యద్ ముద్రస్, టీబీ అలర్ట్‌ ఇండియా ఇంపాక్ట్‌ ప్రాజెక్టు మేనేజర్ ప్రశాంత్,పురుషోత్తం, రఘుపతి, శ్రీనివాస్, రాజు, సంజీవ్ కుమార్,పీహెచ్సీ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ యశోద, సూపర్వైజర్ శ్యామల, ఆశలు, టీబీ చాంపియన్స్, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.