ఆయిల్ ఫాం సాగు పై ఐ.ఐ.ఓ.పీ.ఆర్ ఆద్వర్యంలో  ఎఫ్.పీ.ఓ లకు శిక్షణ

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఐ.ఐ.ఓ.పీ.ఆర్ (భారత జాతీయ ఆయిల్ ఫాం పరిశోధనా విభాగం ) ఆద్వర్యంలో ఆంధ్రప్రదేశ్,ఏలూరు జిల్లా పెదవేగి లో తెలంగాణ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెలకొని ఉన్న  ఎఫ్.పి.ఓ (  ఫాం ఆయిల్ ఫెడ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్) బృందాలకు మంగళవారం ఆయిల్ ఫాం సాగు,అంతర్ పంటలు,ఆశించే చీడఫీడలు పై శిక్షణ ఇచ్చారు.
ఈ శిక్షణను సంస్థ ప్రిన్సిపుల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం.వీ ప్రసాద్,సహా సైంటిస్ట్ డాక్టర్ రామచంద్రుడు రైతులకు అవగాహన కల్పించారు.
అశ్వారావుపేట,అంకం పాలెం,వెంకటాద్రి ఎఫ్.పి.ఓ సభ్యులు తుంబూరు మహేశ్వర రెడ్డి,కొక్కెరపాటి పుల్లయ్య,తుమ్మ రాంబాబు,సంతపురి చెన్నారావు,ఆళ్ళ నాగబాబు,చెలికాని సూరిబాబు లు పాల్గొన్నారు.