
సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటిసారి కార్టూన్ చిత్రకళపై చిన్నారులకు మంగళవారం ప్రముఖ కార్టూనిస్ట్, జర్నలిస్టు నెల్లుట్ల రమణారావు చిన్నారులకు శిక్షణ ఇచ్చారు. మంగళవారం బాల సంస్కార్ వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా సిద్దిపేట శిరిడి సాయిబాబా గుడి ప్రాంగణంలో గీతలతో నవరసాలను, భావోద్వేగాలను కార్టూన్ ద్వారా వ్యక్తీకరించవచ్చునని గీసి చూపించారు. సమకాలిన సమస్యలపై అవగాహనతో కార్టూన్లను వేస్తే ఎందరినో ఆలోచింపజేయవచ్చునని సూచించారు. చిన్నారులకు కార్టూన్ చిత్రకళలో మెలకువలను , నైపుణ్యాలను వివరించారు. ఈ సందర్భంగా బాల సంస్కార్ కోర్స్ డైరెక్టర్ తోట సంధ్య , సిద్దిపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ , ప్రముఖ యోగ శిక్షకులు సతీష్ , కవి బసవరాజ్ రాజ్ కుమార్ తదితరులు కార్టూనిస్టు రామారావును సన్మానించారు.