
కృషి విజ్ఞాన కేంద్రం, కంప సాగర్, త్రిపురారం మండలం ఆధ్వర్యంలో డిండి మండలం లోని ఎర్రగుంటపల్లి గ్రామము లో బుధవారం అధిక సాంద్రత పద్ధతి లో పత్తి సాగు విధానం ఫై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కృషి విజ్ఞాన కేంద్రం, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. శ్రీనివాస రావు మాట్లాడుతూ అధిక సాంద్రత పద్ధతి లో పత్తి సాగు విధానం, పెరుగుదల హార్మోన్ ల పిచికారీ, పెట్టుబడి నికర ఆదాయల గురించి వివరించారు. శాస్త్రవేత్త చంద్ర శేఖర్ ఎరువుల వినియోగం, పత్తి కర్రను నెలలో కలియదున్నడం వల్ల కలిగే ఉపయోగల గురించి, మండల వ్యవసాయంధికారి నాగేశ్వర రావు మాట్లాడుతూ పత్తి పంట తర్వాత అపారల సాగు వలన కలిగే ప్రయోజనాలను వివరించారు.నూజివీడు, రాశి, క్రిస్టల్ కంపెనీలా ప్రతినిధులు అధిక సాంద్రత విధానం లో పత్తి సాగు కు అనువైన రకాలు మరియు వాటి వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ రాణి, రైతులు మురళి, విష్ణు వర్ధన్ రెడ్డి, పెద్దయ్య మరియు ఇతర గ్రామ రైతులు, యంగ్ ప్రొఫెషనల్స్ చక్రవర్తి, వీరభద్రుడు పాల్గొన్నారు.