నవతెలంగాణ-గార్ల: ప్రాథమిక విద్య ను బలోపేతం చేయడానికి పాఠ్య ప్రణాళికలతో కృత్వా ధార భోధన చేయటం ఉత్తమమైన మార్గం అని మండల విద్య శాఖ అధికారి బి.పూల్ చంద్ అన్నారు. జిల్లా విద్యశాఖ అధికారుల అదేశాల మేరకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు తొలి మెట్టు శిక్షణ కార్యక్రమాన్ని మండలంలోని ముల్కనూరు ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభించి మాట్లాడారు.రాష్ట్రంలో విద్య ప్రమాణాలు పెంపు, గుణాత్మకమైన మార్పు కోసం ప్రభుత్వం తొలి మెట్టు కార్యక్రమం ద్వారా చేపడుతుందని చెప్పారు.విద్యార్థులు కనీస సామర్థ్యం సాధించే ఉద్దేశంతో రూపొందించిన ఈ కార్యక్రమంలో పిల్లలు చదవడం, రాయడం,చతుర్విధ ప్రక్రియలు చేయగలగడం ద్వారా సామర్థ్యాలు-అభ్యసన ఫలితాలు సాధింపజేయడానికి దీర్ఘ కాలిక లక్ష్యాలతో ప్రణాళిక బద్దంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు మూడు విడతలుగా నిర్వహించనున్న శిక్షణ తరగతులలో ఈ నెల 2,3 తేదీలలో తెలుగు,4,5 తేదీలలో ఇంగ్లీషు,7,8 తేదీలలో మ్యాథ్స్ సబ్జెక్ట్ లలో శిక్షణ ఇవ్వ నున్నట్లు తెలిపారు.ఉపాధ్యాయులకు పాఠ్య ప్రణాళికలతో అభ్యాస దీపికలు ఎస్ సిఈ ఆర్ టి హైదరాబాద్ వారు రూపొందించిన వాటిని సమర్థవంతంగా విద్యార్థులకు బోధించుటకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం లో కోర్స్ డైరెక్టర్ ఆర్. వెంకట్రావు,ఎన్.సీతా రామిరెడ్డి, అయా పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.