
– ముఖ్య అతిథిగా పాల్గొన్న సీడీబీ డిప్యూటీ డైరెక్టర్ కుమార్ వేల్
నవతెలంగాణ – అశ్వారావుపేట
కొబ్బరి అభివృద్ది బోర్డు, విజయవాడ కేంద్రం సహకారంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదేశాలు మేరకు స్థానిక వ్యవసాయ కళాశాల లో ఆరు రోజులు పాటు కొబ్బరికొబ్బరి అభివృద్ది బోర్డు,విజయవాడ కేంద్రం సహకారంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదేశాలు మేరకు స్థానిక వ్యవసాయ కళాశాల లో వృక్ష మిత్రులకు నిర్వహించే శిక్షణను బుధవారం కళాశాల అసోసియేట్ డీన్ హేమంత్ కుమార్ ప్రారంభించారు. 24 నుండి 29 వరకు ఈ శిక్షణ కొనసాగుతుంది.ఇందులో 20 మంది నిరుద్యోగ యువకులకు కొబ్బరి దింపు పైన,కొబ్బరి కాయలు కోయడం,కొబ్బరి చెట్టు పై చీడపీడలు నివారణ, కొబ్బరి వృక్షాలు ఎక్కే యంత్రాల ద్వారా శిక్షణా ఇవ్వబడుతుంది.ప్రతి రోజు ఉదయం 6 నుండి సాయంత్రం వరకు వారికి జాగింగ్,యోగా, శాస్త్రీయ జ్ఞానాన్ని , స్కిట్ , డ్రామా,క్షేత్ర దర్శన తో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్య అతిథి గా హాజరైన కొబ్బరి అభివృద్ది మండలి విజయవాడ కేంద్రం ఉప సంచాలకులు కుమార్ వేల్ కొబ్బరి బోర్డు యొక్క స్కీమ్ లు గురుంచి వివరించారు. కళాశాల అసోసియేట్ డీన్ డా.జె.హేమంత కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం ఎంతో ఆనందదాయకం అని శిక్షణకు వచ్చిన ట్రైనీ లు అందరూ కొబ్బరి వృక్ష మిత్రులుగా కొబ్బరి వృక్షాలు ఎక్కడం, ఇతర శాస్త్రీయ అంశాలు తెలుసుకొని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల శాస్త్రవేత్తలు కె.శిరీష,పి.నీలిమ సమన్వయ పరిచారు. ఈ కార్యక్రమంలో 20 మంది శిక్షణ అర్హులు నారంవారిగూడెం, పేరాయిగూడెం,అశ్వారావుపేట నుండి వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్స్ ఐ.వి.శ్రీనివాసరెడ్డి,కె.గోపాలకృష్ణ మూర్తి,శ్రావణ్ కుమార్, రమేశ్,.కోటేశ్వర్,ఝాన్సి రాణి,ఎస్‌ఎంటి.జంబమ్మ,ఏ.ఈ.ఎల్.పి విద్యార్థిని విద్యార్ధులు పాల్గొన్నారు.