ఉమ్మడి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఎన్నికల కోడ్ గురించి శిక్షణ

– డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్

నవతెలంగాణ-  కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్  వైజయంతి ఆదేశాల మేరకు శనివారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి. లక్ష్మీనర్సయ్య నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని కోర్టులో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమావేశములో ఎన్నికల కోడ్ గురించి, డబ్బులు/వస్తువులు స్వాధీనపరిచేటప్పుడు పోలీసులు పాటించవలసిన పద్ధతులు ఓటు యొక్క విలువ, ఓటరు యొక్క విలువలు, రాజకీయ నాయకులు పాటించవలసిన పద్దతులు గురించి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు భూసారపు రాజేష్ గౌడ్, చిదరాల రాణి క్లుప్తముగా విషదీకరించారు. ఇట్టి సమావేశములో నూతనంగా ఎంపికైన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ శ్యాంరావ్, వసంత్  ఖాందేష్ శ్రీనివాస్ కు శాలువాలతో సన్మానించారు. ప్రతి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన విధులను శ్రద్ధతో నిర్వహించి, నేరస్తులకు శిక్షపడేటట్లు కృషి చేయాలని కోరినారు. ఈ సమావేశంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు భూసారపు రాజేష్ గౌడ్, చిదిరాల రాణి, వీరయ్య, పొరిక రాజేశ్వరి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రవిరాజ్, వసంత్, శ్యాంరావ్, ఖాందేష్ శ్రీనివాస్, కే.శేషు, నిమ్మ దామోదర్ రెడ్డి, డా॥ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.