జిల్లాకు నూతనంగా విచ్చేసిన కానిస్టేబుల్ లకు వారానికి ఒకరోజు చొప్పున ఐదు వారాలపాటు సిబ్బందికి వివిధ అంశాలలో నిష్ణాతులైన సిబ్బంది చేత పోలీస్ స్టేషన్ విధులు, ప్రస్తుత పోలీస్ విధి విధానాలు అంశాలపై శిక్షణను అందించినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. డిసెంబర్ 20వ తారీఖున ప్రారంభమై మూడు బ్యాచులుగా విభజించి వారానికి మూడు రోజులపాటు శిక్షణను తీసుకొని నిష్ణాతులైన నూతన 145 సివిల్ కానిస్టేబుల్ సిబ్బంది. ఈ శిక్షణలో భాగంగా సిబ్బంది కోర్టు డ్యూటీ విధులు, రిసెప్షన్ విధులు, పిటీషన్ మేనేజ్మెంట్ విధులు, బ్లూ కోర్ట్, డయల్ 100, పెట్రోలింగ్, బిట్ సిస్టం, అనుమానితులను పరిశీలించడం, నేర నియంత్రణ, నేర పరిశోధన, సి సి టి ఎన్ ఎస్, సైబర్ క్రైమ్, సి ఈ ఐ ఆర్, ముఖ్యంగా ప్రమాదాల సమయంలో ప్రజలను కాపాడేందుకు ఉపయోగపడే సిపిఆర్ పద్ధతిని సిబ్బందికి పూర్తి అవగాహనను కల్పించడం జరిగిందని తెలిపారు. శనివారం పోలీస్ కార్యాలయంలో ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. నేర పరిశోధనలో సాక్షాదారాలు ముఖ్యమైనవి తెలిపారు. కోర్టులో నేరం నిరూపించేందుకు సాక్షదారాలను పరిరక్షిస్తూ పరిశోధన చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు దారుల పట్ల న్యాయంతో వ్యవహరిస్తూ తక్షణమే సిబ్బందిని కేటాయించి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా సమాజంలో బీదస్థుల పట్ల, వెనుకబడిన తరగతులు వారి పట్ల, ఆదివాసుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ న్యాయం చేకూర్చే విధంగా చర్యలను తీసుకొని ప్రజలకు పోలీసుల పట్ల ఉన్న గౌరవాన్ని కీర్తిని పెంపొందించే దిశగా కృషి చేయాలని సూచించారు. న్యాయం ప్రతి ఒక్కరికి సమానమే అనే అంశాన్ని ప్రతి ఒక్కరూ మనసులో ఉంచుకుని విధులను నిర్వర్తించాలని సూచించారు. అదేవిధంగా పోలీసు విధులను కమ్యూనికేషన్ వ్యవస్థ కీలకమైనది వాటిని ఉపయోగించే విధానాన్ని నేర్చుకొని అమలుపరచాలని సూచించారు. పోలీసులలో ముఖ్యంగా శారీరక మరియు మానసిక ఒత్తిడిలకు గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే విధంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా శిక్షణను అందించి తమ వంతు పాత్ర కీలకంగా పోషించిన మరియు కోర్టు విధులు న్యాయపరంగా వచ్చే సమస్యలపై వివరించిన మాజీ పీపి రమణారెడ్డి, ఫిజికల్ మేనేజ్మెంట్పై శిక్షణ అందించిన పురుషోత్తం రెడ్డి, సుధీర్ రెడ్డిలను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ శిక్షణ ను పూర్తి చేయడంలో కీలకపాత్ర పోషించిన డబ్ల్యూ పిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి వెంకట్ ని జిల్లా ఎస్పీ అభినందించారు