
రెంజల్ మండలం నీలా జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ శిక్షణ తరగతులు నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ. శంకర్, ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు తాహెర్ లు తెలిపారు. రెంజల్, ఎడపల్లి, నవీపేట్,మండలాలకు సంబంధించిన ఉపాధ్యాయులకు మొదటి విడుదల విద్యార్థులకు విద్యాబోధనపై సృజనాత్మకత ఏ విధంగా ప్రోత్సహించాలి అనే అంశంపై శిక్షణను ఇచ్చినట్లు వారు తెలిపారు. చిన్నారులకు చదువుతో పాటు, ఆటపాటలతో వారికి విద్య బోధన చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి గంగాధర్, మూడు మండలాలకు సంబంధించిన ఉర్దూ మీడియం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.