గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ..

Training for village fresh water helpersనవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండల  పరిధిలో పనిచేసే గ్రామ మంచినీటి సహాయకులకు నాలుగు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని అడవి ఆధ్వర్యంలో భువనగిరి ఎంపీడీవో సమావేశం మందిరంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ సీఈఓ ఎన్ శోభారాణి హాజరై, మాట్లాడారు. గ్రామస్థాయిలో పనిచేసే మంచినీటి సహాయకులకు పరిశుభ్రమైన వాటర్ అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. నీటి సరఫరా, సమస్యలు తలెత్తినప్పుడు ఎలా వ్యవహరించాలి, ముఖ్యంగా గ్రామస్థాయిలో ఓపెన్ కులాయిల పట్ల ఈ విధంగా వ్యవహరించాలనేది చర్చించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈ ఈ కరుణాకర్, క్యూ సి డిపార్ట్మెంట్ డి ఈ బాలమణి, భువనగిరి ఎంపీడీవో శ్రీనివాస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గుండీ రావు, శ్రీలత, శ్వేత, అభిలాష్, పవన్, మండల పంచాయతీ అధికారి దినాకర్, అన్ని గ్రామ పంచాయతీల వాటర్ మ్యాన్,  కారోబార్లు పాల్గొన్నారు.