మిత్ర ఫౌండేషన్ ద్వారా తేనె టీగల పెంపకం పైన  శిక్షణ..

నవతెలంగాణ – వేములవాడ రూరల్
మిత్ర ఫౌండేషన్ ద్వారా తేనె టీగల పెంపకం పైన  శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం వేములవాడ అర్బన్ మండలంలోని రుద్రవరం గ్రామం లో ముంపు గ్రామాలలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం పై జిల్లాస్థాయి శిక్షణ తరగతులను, ఉపాధి పొందడం కొరకు మిత్ర ఫౌండేషన్  ఇంద్రారెడ్డి, రామచంద్రయ్య  ద్వారా   తేనెటీగల పెంపకం, ఇతర ఉపాధుల  పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యువత  తేనెటీగలు  పెంచి తేనే అమ్మడం ద్వారా మంచి ఉపాధి పొందవచ్చని తెలిపారు. ఇట్టి కార్యక్రమం లో ఎంపీటీసీ గాలిపెల్లి సువర్ణ స్వామి, మాజీ సర్పంచ్ లు ఊరడి రాంరెడ్డి, పిల్లి రేణుక కనుకయ్య, మాజీ ఎంపీటీసీ వంకాయల భూమయ్య, మాజీ వార్డ్ సభ్యులు బెజుగం మహేష్, తునికి కనుకరాజు, కట్ట లావణ్య తిరుపతి, నడిగొట్ల స్వప్న హరికృష్ణ, మెడికల్ రాజిరెడ్డి, గోనె భాస్కర్, చల్ల నర్సయ్య, కూతురు బక్కయ్య, ఎరుకల రాజిరెడ్డి, ఊరడి నర్సింహా రెడ్డి, ఎరెడ్డి సాయిరెడ్డి, సంతపురి లింగారెడ్డి, అలిపిరి సురేష్ రెడ్డి, తునికి రవి, కాసర్ల అరుణ్, అలిపిరి హన్మాండ్లు,పచ్చిమట్ల పర్శరాములు,  ఎర్ర లచ్చయ్య గ్రామ ప్రజలు తో పాటు తదితరులు పాల్గొన్నారు.