మిషన్ భగీరథ సర్వే పై శిక్షణ..

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలోని  కేశవపట్నం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం టి వో టి కరీంనగర్ ఎంపీవో సిహెచ్. జగన్మోహన్ రెడ్డి, మిషన్ భగీరథ సర్వే పై మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి టీచర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వివో ఏలకు మిషన్ భగీరథ పై  శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో నల్ల శ్రీవాణి, ఎంపీఓ ఖాజా బషీరుద్దీన్ లు పాల్గొన్నారు.